Breaking NewscrimeHome Page SliderNational

మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రం

Share with

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల స్త్రీల సగటు మద్య పానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉందని స‌ర్వే తెలిపింది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్ (3.3%) ఉన్నాయని స‌ర్వే ప్ర‌క‌టించింది. గతంలో టాప్ లో ఉన్న ఝార్ఖండ్ (9.9%), త్రిపుర (9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి ప‌డిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ జాబితాలో లేకపోవడం గమనార్హం.