స్టార్ హీరోకు రూ.1.50 కోట్ల జరిమానా
తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్‌కు ఆదాయపు పన్ను శాఖ రూ.1.50 కోట్ల జరిమానా విధించింది. ఈ విషయమై మద్రాస్ హైకోర్టులో నివేదిక దాఖలు చేసింది. 2015-16 వ ఆర్థిక సంవత్సరానికి రూ. 35.42 కోట్ల ఆదాయం పొందినట్లు ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారు. కానీ ఇది తప్పని ఇంకా 15 కోట్ల రూపాయలను లెక్కల్లో చూపలేదని ఐటీ శాఖ ఆరోపణలు చేసింది. 2015లో విజయ్ ఇంట్లో జరిపిన సోదాలలో పులి అనే సినిమాకు 15 కోట్లు తీసుకున్నారని దానిని లెక్కల్లో చూపలేదని తెలియజేసింది. దీనితో రూ.1.5 కోట్లు జరిమానా విధించింది. దీనిపై విచారణను ఈ నెల 30 కి వాయిదా వేశారు న్యాయమూర్తి.