Home Page SliderNational

వేసవిసెలవుల కోసం ప్రత్యేక రైళ్లివే

దక్షిణ మధ్య రైల్వే వేసవి సెలవలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటించి, ప్రయాణికులకు శుభవార్త నందించింది. సికింద్రాబాద్- దనపూర్, నాందేడ్-ఈరోడ్,సంబల్ పూర్- కోయంబత్తూర్ మధ్య 62 రైళ్లను నడపబోతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ సర్వీసుల వివరాలు, అవి ఆగే స్టేషన్లు, సమయాలతో ప్రకటన విడుదల చేశింది.

సికింద్రాబాద్ -ధనపూర్ మధ్య మే 5 నుండి జూలై 6 వరకూ ప్రతీ ఆదివారం బయలుదేరుతుంది. అలాగే ధనపూర్‌లో ప్రతీ గురువారం బయలుదేరుతుంది.

నాందేడే- ఈరోడ్ రైలు ఏప్రిల్ 21 నుండి జూన్ 30 వరకూ ప్రతీ శుక్రవారం నాందేడ్ నుండి   బయలు దేరుతుంది. అలాగే ఈరోడ్ నుండి ప్రతీ ఆదివారం బయలుదేరుతుంది.

సంబల్‌పూర్- కోయంబత్తూర్ రైలు ఏప్రిల్ 19 నుండి జూన్ 28 వరకూ ప్రతీ బుధవారం బయలుదేరితో కోయంబత్తూర్ నుండి శుక్రవారం బయలు దేరుతుంది.

ఈ రైళ్లన్నీ ఆయా స్టేషన్లలో ఆగి ప్రయాణీకులకు సేవలందిస్తాయి.