Home Page SliderTelangana

కాంగ్రెస్ లోకి సోయం, సక్కు

Share with

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవాళ హైదరాబాద్ గాంధీభవన్ లో టీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నేతలను బెదిరింపులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిందన్నారు. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని, వారు త్వరలోనే పార్టీలో చేరే అవకాశం ఉందన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై స్పందిస్తూ వ్యాఖ్యానించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు.