Home Page SliderInternational

త్వరలోనే ప్రపంచాన్ని మా గుప్పిట్లోకి  తెచ్చుకుంటాం

Share with

పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడి మారణ హోమం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ యుద్ధంలో ఎన్నో వందల మంది ఇజ్రాయెల్ సైనికులతోపాటు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇజ్రాయెల్ కూడా ఈ పాలస్తీనా హమాస్ ఉగ్రవాదుల దాడిని గట్టిగానే తిప్పి కొడుతుంది. అయితే ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.ఈ నేపథ్యంలో హమాస్ కమాండర్ మహమ్మద్ అల్-జహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌పై దాడి ఆరంభం మాత్రమే అని ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవడమే తమ లక్ష్యమని తెలిపారు. కాగా 510 మిలియన్ చదరపు కిలోమీటర్లు ఉన్న ఈ భూమండలం అంతా మా వశం అవుతుంది అన్నారు. ఈ విధంగా త్వరలోనే అన్యాయం ,అణచివేత,హత్యలు లేని..అరబ్బులపై  అఘాయిత్యాలకు పాల్పడలేని ఓ వ్యవస్థ పరిధిలోకి వస్తుందని హమాస్ కమాండర్ మహమ్మద్ అల్-జహర్ తెలిపారు.