Home Page SliderTelangana

హైదరాబాద్‌లో హమాస్‌కు అనుకూలంగా నినాదాలు.. విద్యార్థుల అరెస్టు

Share with

హైదరాబాద్‌లోని బషీర్ బాగ్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కొందరు విద్యార్థులు పాలస్తీనా హమాస్‌లకు సంఘీభావం తెల్పడం సంచలనం సృష్టించింది. పాలస్తీనా లాంగ్ లివ్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. దీనితో పోలీస్ సిబ్బంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర యుద్ధంలో వేల మంది సైనికులు, ప్రజలు చనిపోయారు. ఈ నేపథ్యంలో  తీవ్రవాదులు నక్కిఉన్న  గాజాపై జరిగిన ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు అనుకూల నినాదాలు చేపట్టారు. కాగా భారత్ ఇజ్రాయెల్ ‌పై హమాస్ దాడిని ఖండించిన విషయం తెలిసిందే.