సబ్ మెరైన్ మునిగి ఆరుగురి మృతి..
ఈజిప్టులోని ప్రముఖ రేవు నగరమైన హుర్‌ఘడలో సబ్ మెరైన్‌కు ప్రమాదం జరిగింది. ఎర్ర సముద్రంలో పర్యాటకుల జలాంతర్గామి మునిగిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. దీనితో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో తొమ్మిది మందికి గాయాలు అయ్యాయని, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వారు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో సబ్‌మెరైన్‌లో 40 మంది ఉన్నారని అంచనా.

