Home Page SliderTelangana

సింగరేణి ఎన్నికలు వాయిదా

Share with

సింగరేణి ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6 నుంచి 9 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం అక్టోబర్ 10వ తేదిన ఎన్నికల చిహ్నాల కేటాయింపు జరుగుతుంది. కాగా అక్టోబర్ 28న ఎన్నికలు జరుగుతాయి.అయితే అదే రోజు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌ను ఏఐటియూసీ,బీఎమ్ఎస్ స్వాగతిస్తున్నాయి. మరోవైపు ఐఎన్టీయూసీ,హెచ్ఎమ్ఎస్,సీఐటీయూ ఎన్నికల వాయిదాకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. సింగరేణి ఎన్నికల నిలుపుదల కోసం యాజమాన్యం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపైనే సింగరేణి ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే సింగరేణి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణా హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ మేరకు సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.అంతేకాకుండా నవంబర్ 30లోపు ఓటర్ల లిస్ట్ రెడీ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.