Home Page SliderNational

షాహిద్‌కపూర్‌ని సినిమాలకు పరిచయం చేయని పంకజ్ కపూర్

Share with

బాలీవుడ్‌ సినిమాల్లోకి షాహిద్ కపూర్‌ని ఎందుకు పరిచయం చేయలేదో వివరించిన పంకజ్ కపూర్. తనకు తానుగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలనే నేపథ్యంలో అలా చేయవలసి వచ్చింది. షాహిద్ ఇష్క్ విష్క్‌తో అరంగేట్రం చేసి తనంతట తానుగా విజయం సాధించాడు. పంకజ్‌కపూర్ బాలీవుడ్‌కి షాహిద్‌కపూర్‌ను ఎప్పుడూ పరిచయం చేయలేదు. కపూర్ చిత్ర పరిశ్రమలో తనకు తానుగా ఎదగాలనే నమ్ముతారు. షాహిద్ కపూర్ 2003లో ఇష్క్ విష్క్‌తో రంగప్రవేశం చేశాడు. పరిశ్రమలో అతనికి మంచి స్థాయి, సంబంధాలు ఉన్నప్పటికీ, ప్రముఖ నటుడు పంకజ్ కపూర్ తన కొడుకు షాహిద్ కపూర్ కెరీర్‌ను చాలామంది బాలీవుడ్ తల్లిదండ్రుల మాదిరి తమ పిల్లల్ని సినిమాల కోసం హీరోల్ని చేసే విధంగా డైరెక్ట్‌గా పరిచయం చేయలేదు. ఒక ఇంగ్లీష్ పేపర్‌తో ప్రత్యేక చాట్ సందర్భంగా, నటుడు షాహిద్‌ను ఎందుకు సినిమాలకు దూరం పెట్టాలనుకున్నాడో, తన నమ్మకాలను వివరించాడు. కపూర్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం బిన్నీ ఔర్ ఫ్యామిలీని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఉన్నాడు.

సినీ పరిశ్రమలో కుటుంబ సభ్యుడిని లాంచ్ చేయడం అనే కాన్సెప్ట్‌పై తాను విశ్వసించడం లేదని కపూర్ స్పష్టం చేశారు. షాహిద్‌ను లాంచ్ చేయకపోవడం గురించి అడిగినప్పుడు, “నేను అటువంటి సెంటిమెంట్స్‌ని నమ్మను,” అని కపూర్ చెప్పారు. “ప్రతి వ్యక్తి తనకు తానుగానే ఎదగాలి, వారు జీవితాన్ని సొంతంగానే స్టార్ట్ చేయగలగాలి, సాధించగలగాలి అని నేను నమ్ముతున్నాను. ఇది మా నాన్న నాకు నేర్పించిన పాఠం. “మీ విజయానికి మీరే బాధ్యత వహించాలి, తద్వారా మీరు ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు. ఆ ఆత్మవిస్వాసం మిమ్మల్ని జీవితంలో మెట్లు ఎక్కిస్తుంది. లేకపోతే, మీరు ఎల్లప్పుడూ, మీ జీవితమంతా, మీకు సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని ఎదురుచూస్తుంటారు. ఆ క్రెడిట్ మీదే నాన్నగారూ. ‘నేను ఎలా చేయగలను అనుకుంటున్నానో అలా చేయగలగాలి’ అని మీపై మీకు నమ్మకం ఉండాలి అని చెప్పేవారు మా తండ్రి గారు. మీరు అలా చేస్తే, మీరు మీ సొంతకాళ్ళపై నిలబడతారని, మీరు ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు సాగగలరని నేను భావిస్తున్నాను. ఈ రోజు, వారిలో ఎవరైనా విజయం సాధించినట్లయితే, అది వారు చేస్తున్నందుకే అని భావించాలి. అది ఎందుకంటే వారి వ్యక్తిత్వం, వారి నిజాయితీ, కృషి, ప్రతిభ కారణంగా, ‘అయ్యో, నాన్న నా కోసం ఇలా చేశాడు’ అని చెప్పాల్సిన అవసరం ఉండదు. షాహిద్ కపూర్ 2003లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇష్క్ విష్క్‌లో తొలిసారిగా నటించాడు. అతను ఉడ్తా పంజాబ్, కమీనీ, హైదర్, జబ్ వి మెట్ వంటి హిట్ చిత్రాలలోనూ నటించారు.