Home Page SliderNational

ఐటీ రైడ్స్‌లో 48 గంటల్లో రూ.102 కోట్లు లభ్యం…’దటీజ్ ఇండియా’..

Share with

భారత్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకపక్క ఒకపూట తిండి కోసం కోట్ల మంది పేదలు అల్లాడుతుంటే, మరోపక్క కోట్ల కొలది డబ్బు ప్రవహిస్తోంది. అక్టోబర్ 12 నాడు ఐటీ శాఖ జరిపిన దాడుల్లో అక్షరాలా రూ.102 కోట్లు విలువైన నగదు, బంగారం, వజ్రాలు, గడియారాలు లభ్యమయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఐటీ శాఖ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు, రాజకీయ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 55 ప్రదేశాలలో జరిపిన ఈ సోదాలలో కళ్లు చెదిరేలా కోట్ల కొలది డబ్బు బయటపడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీలలో ఈ సోదాలు జరిగాయి. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది.