మిస్ వరల్డ్ పోటీలపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
హైదరాబాద్‌లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ పోటీల ఏర్పాట్లను ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. పోటీలకు వస్తున్న అతిథులకు, పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలని, ఎయిర్ పోర్టు, హోటల్స్ వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. చారిత్రక కట్టడాల వద్ద, పర్యాటక ప్రాంతాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కూడా ఉగ్రదాడి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ సూచనలతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా మే 10 నుండి మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానుండడం అనేక దేశాల నుండి సెలబ్రెటీలు ఈ పోటీలకు వస్తూండడం వల్ల భద్రతను అధికం చేశారు.

