రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత
అలనాటి మేటి స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు ఆయన మృతి చెందారు. సినీ స్టార్ గా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎన్నో సంచలనాలు ఆవిష్కరించారు. టాలీవుడ్ ఆయనను రెబల్ స్టార్‌గా పిలుస్తోంది. నంది అవార్డులు ప్రకటించిన తొలిసారి ఆయనకు అవార్డు లభించింది. చిలకా గోరింక సినిమాతో 1966లో విడుదలయ్యింది. 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులను పొందాడు. 12 లోక్ సభకు కాకినాడ నుంచి 13వ లోక్ సభకు నర్సాపురం నుంచి కృష్ణంరాజు ఎన్నికయ్యారు. 1999-2004 మధ్య వాజ్ పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగాను, పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. 2009లో పీఆర్పీలో చేరి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి బీజేపీలో కొనసాగుతున్నారు. అంతే కాదు టాలీవుడ్ కు ప్రభాస్ లాంటి యంగ్ ఎనర్జిటిక్ హీరోను అందించారు కృష్ణంరాజు. పెదనాన్న కృష్ణంరాజుకు తగ్గ తనయుడిగా ప్రభాస్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.


