మెగాస్టార్ నోట అలరించిన ‘రంగమార్తాండ’ షాయరీ
మెగాస్టార్ చిరంజీవి గొప్ప నటుడు మాత్రమే కాదు. నవరసాలు పలికించగలడు, ఎలాంటి పాత్రలోకైనా అవలీలగా పరకాయప్రవేశం చేయగలడు. విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రం కోసం నేనొక నటుడ్ని అంటూ షాయరీని వినిపించాడు చిరంజీవి. ఈ చిత్రం రంగస్థల నటీనటుల జీవితాల ఆధారంగా రూపొందుతోంది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈచిత్రంలో ముఖ్య కథాంశం అయిన నటుల జీవితాలనుద్దేశించి సాగే ఈ కవితను చిరంజీవి వినిపించడం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. దీనికి లయరాజు ఇళయరాజా సంగీత స్వరాలు అందించారు. ఈ షాయరీ ఈరోజే (బుధవారం) విడుదలయ్యింది. ఈ కవితలో రంగస్థల నటుల నిజజీవితం, రంగస్థల జీవితానికి వ్యత్యాసాన్ని తెలియజేస్తూ పదాలు కూర్చబడ్డాయి. తాను వేదిక పైననే నటుడ్ని అంటూ, వేదిక దిగితే సామాన్య మానవుడినే అని చిరంజీవి కవిత సాగిపోతుంది.

