రాజేంద్రప్రసాద్‌కు సినీ ప్రముఖుల పరామర్శ
కుమార్తె మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్‌ను పరామర్శించారు సినీ ప్రముఖులు. మెగాస్టార్ చిరంజీవి ఆయనను కలిసి, పరామర్శించి ధైర్యం చెప్పారు. వెంకటేశ్, అల్లుఅర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు ఆయనను పరామర్శించారు. తన చిన్నప్పుడే కన్నుమూసిన తన తల్లిని తన కుమార్తెలో చూసుకుంటున్నానని బాధపడ్డారు రాజేంద్రప్రసాద్. ఆయన కుమార్తె 38 ఏళ్ల గాయత్రికి ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది.