పీవీ సింధుకి పెళ్లి ఈ నెలలోనే…
రెండుసార్లు ఒలింపిక్స్ పతకాలు సాధించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వివాహం నిశ్చయమయ్యింది. ఈ నెలలోనే ఆమె వివాహం జరగనున్నట్లు ఆమె తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త వెంకట దత్త సాయితో ఆమె వివాహం డిసెంబర్ 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్‌లో రిసెప్షన్ జరగనుంది. వీరిద్దరి కుటుంబాలు చాలా కాలం నుండి తెలుసని, అయితే వివాహ విషయం మాత్రం గత నెలలోనే నిర్ణయించామని ఆమె తండ్రి పేర్కొన్నారు. వెంకట దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్‌గా ఉన్నారు. పీవీ సింధుకి జనవరి నుండి బిజీ షెడ్యూల్ ఉండడంతో ఈ నెలలోనే వివాహం జరపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఇటీవల సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వులుయోను చిత్తు చేసి టైటిల్ సాధించింది పీవీ సింధు.