చంద్రబాబుకు మద్దతుగా కొవ్వొత్తులతో నిరసన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ మోడల్ కాలనీలో కాంతితో క్రాంతి పేరిట నిరసన చేపట్టారు. మోడల్ కాలనీ, జెక్ కాలనీ, సుందర్ నగర్‌కు చెందిన 200 మంది కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. కొవ్వొత్తులతో సీబీఎన్ అంటూ అక్షరాలు రూపొందించారు. కాలనీ ప్రతినిధులు దండా బుచ్చిబాబు, లక్ష్మణ్‌రావు, మాచారావు, జీపీరావు, డా.రాఘవయ్య, తెదేపా బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కానూరి జయశ్రీ తదితరులు హాజరయ్యారు.