ఏపీ ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా తెలుగులో ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలియజేశారు. ఏపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.