ఏపీ అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. నోరు జారిన రామ్ చరణ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లెప్పుడంటూ అభిమానులందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎవరిని చేసుకుంటారు అంటూ జోక్స్ కూడా వేస్తుంటారు. ఇటీవల ఆహా టీవీలో అన్‌స్టాపబుల్ షోకి వచ్చిన రామ్‌చరణ్‌ను హోస్ట్ బాలకృష్ణ ఈ ప్రశ్న అడిగారు. ప్రభాస్ తన స్నేహితుడు కావడంతో రామ్ చరణ్ నోరు జారి పెళ్లి విషయం చెప్పేశారు. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.