ప్రభాస్ కల్కి@1000 కోట్లు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కల్కి. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000కోట్లు కలెక్షన్లు సాధించినట్లు మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. మా సినిమాపై మీరు కురిపించిన ప్రేమతో ఈ మైలురాయిని చేరుకున్నామని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ సంస్థ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.