ప్రముఖ స్టార్ హీరో కూతురు పెళ్లి డేట్ ఫిక్స్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు మ్రోగనున్నాయి. ఆయన కూతురు ఐరాఖాన్ పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యింది. ఐరాఖాన్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరికి నవంబర్ 18 న నిశ్చితార్థం జరగనుంది. కాగా వచ్చే ఏడాది జనవరి 3న వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అమిర్ ఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కూతురు ఐరా డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నుపుర్ ఎంతో సాయం చేశారని అమిర్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాగా నుపుర్ పలువురు ప్రముఖ సెలబ్రిటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేశారు.