Andhra PradeshHome Page Slider

‘టీటీడీ ఉద్యోగులదే మహాపరాధం’.. తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్

కల్తీ నెయ్యి ప్రసాదాలకు వాడుతున్నారని తెలిసి కూడా టీటీడీ ఉద్యోగులు మౌనంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎవరికి మీరు భయపడి ఈ విషయం బయటపెట్టలేదు అని నిలదీశారు. తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్న వ్యక్తులది కూడా తప్పేనన్నారు. మన ప్రాధమిక హక్కు అయిన మన సంస్కృతిని కాపాడుకునే హక్కు కూడా మీకు లేదా అంటూ మండిపడ్డారు. టీటీడీ బోర్డును సూటిగా ప్రశ్నిస్తున్నానని ఈ పనులు ఎవరు చేశారో ఇప్పటికైనా బయటపెట్టాలన్నారు. తప్పును కప్పిపుచ్చవద్దని హెచ్చరించారు.  ఇతర మతాలను చూసి అయినా హిందువులు మారాలని విజ్ఞప్తి చేశారు. మీ మతాన్ని ముందు మీరు గౌరవించుకోండి, తప్పు జరిగితే ముందుకు రండి అంటూ పిలుపునిచ్చారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా అనేక అన్యాయాలను ప్రశ్నించానని, ఎన్నో సమస్యలు తెలుసుకున్నానని కానీ ఈ విషయం అప్పుడెవ్వరూ తెలియజేయలేదని మండిపడ్డారు. అందుకే తాను 11 రోజుల పాటు ప్రాయశ్చిత్తంగా స్వామివారి దీక్ష తీసుకుంటున్నానని పేర్కొన్నారు.