“పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదు”:కొడాలి నాని
ఏపీలో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రూపాయి పావలా ప్రభుత్వం అంటే మా పార్టీకి 125 సీట్లు వస్తాయని పవన్ చెప్పకనే చెప్పారన్నారు. అయితే పవన్ కళ్యాణ్‌ని అందరు పావలా పవన్ అంటారు.కాబట్టి ఆయనకు,ఆయన పొత్తు పెట్టుకున్న పార్టీకి 25 సీట్లే వస్తాయని అర్థం అని కొడాలి నాని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా పవన్ మొరిగే కుక్క తప్ప కరిచే కుక్క కాదని కొడాలి నాని విమర్శించారు.