ఈ నెల 24 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం
ఈ నెల 24 నుండి వచ్చేనెల 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఎంపీలతో ఈ నెల 24, 25 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేయిస్తామని వివరించారు. 26న స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇక 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. ఎన్డీయే 3.0 కి ఇది తొలి సెషన్ కావడం గమనార్హం.