Home Page Sliderindia-pak warInternationalNews AlertPolitics

‘భారత్ చావుదెబ్బ కొట్టింది’..ఒప్పుకున్న పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ దెబ్బకి పాకిస్తాన్‌కి చుక్కలు కనిపించాయి. వారి కీలక వైమానిక స్థావరాలు మన మిస్సైల్స్ దెబ్బకి ధ్వంసమయ్యాయి. అయితే ఇన్నాళ్లూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ‘మాకేం కాలేదు. భారత్ దాడిని తిప్పికొట్టాం’ అంటూ చెప్పుకుంటున్న పాకిస్తాన్ ప్రధాని తొలిసారిగా భారత్ తమను చావుదెబ్బ కొట్టిందంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం రాత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మే9, 10 తేదీలలో రావిల్పిండిలోని నూర్ ఖాన్‌తో పాటు ఇతర కీలక వైమానిక స్థావరాలపై భారత్ క్షిపణులు దాడి చేశాయని పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ దాడులు చేస్తున్న విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఫోన్ చేసి చెప్పారని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కోవడానికి చైనా యుద్ధ విమానాలను వనియోగించామని చెప్పారు. భారత్, పాక్‌ల మధ్య ఇప్పటి వరకూ మూడుసార్లు యుద్ధాలు జరిగాయని, కానీ సాధించిందేమీ లేదని, ఇరు దేశాలు కూర్చుని జమ్ముకశ్మీర్ వంటి ప్రధాన అంశాలు చర్చించుకోవాలని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.