మా ఆడవాళ్లు విపరీతంగా తాగుతున్నారు సార్.. పోలీసులకు ఫిర్యాదు..
‘నా భర్త తాగి వచ్చి కొడుతున్నాడు సార్’ అంటూ పోలీసులకు ఫిర్యాదులు రావడం సర్వసాధారణం. కానీ ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్(D) పోలీసులకు ఇందుకు భిన్నమైన కంప్లెంట్లు వస్తున్నాయి. అక్కడి కొండగూడ గ్రామానికి చెందిన పురుషులు ‘మా ఇంటి ఆడవారు విపరీతంగా మద్యం తాగుతున్నారు సార్’ అని ఆవేదన చెందారు. దీంతో కుటుంబాలు నాశనం అవుతున్నాయని పోలీసులకు పురుషులు మొరపెట్టుకున్నారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి నిలువరించండి అని ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ ఘటన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.