తెలంగాణా కాంగ్రెస్లో కొనసాగుతున్న సీట్ల పంచాయితీ
తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.దీని ప్రకారం తెలంగాణాలో నవంబర్ 30న అసెంబ్లీ జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 50 రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రేమే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మరోవైపు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ,బీజేపీ పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. గాంధీభవన్ ముందు ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కాగా వారు ఆసిఫాబాద్ టికెట్ శ్యామ్ నాయక్కి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆసిఫాబాద్ టికెట్ ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న సరస్వతికి ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.