కూల్చడంలో నెంబర్ 1 సర్కార్!
గత ప్రభుత్వ హయాంలో 2018లో దుర్గ గుడి కింద కనకదుర్గ నగర్‌లో రూ.5.55 కోట్లతో రాతి స్తంభాల మండపాలు నిర్మించారు.
గత ప్రభుత్వ హయాంలో 2018లో దుర్గ గుడి కింద కనకదుర్గ నగర్‌లో రూ.5.55 కోట్లతో రాతి స్తంభాల మండపాలు నిర్మించారు. ఇప్పుడు వాటిని తొలగించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కొండ కిందకు దిగి ఈ మండపాల్లోంచి నడిచి బయటకొచ్చేవారు. తొలగించాక ఆ ప్రాంతమంతా బోసిపోయింది. నాలుగు నెలల కిందటే దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తొలగించాలని ఆదేశించారు. బయట వర్షం, ఎండగా ఉన్నప్పుడు మండపాల్లో సేదతీరే వాళ్లం. ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు. అయినా.. కట్టడం మరిచి ఇలా తొలగించుకుంటూ పోతే ఎలా.. అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.