ఏపీ ప్రభుత్వం కొత్త పథకం
ఏపీ ప్రభుత్వం దేవాలయాలకు కొత్త పథకం ప్రవేశపెట్టింది. ప్రైవేట్ దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు నెలకు రూ.10 వేల చొప్పున ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సరైన నిధులు లేక దాదాపు 6వేల దేవాలయాలలో నిత్య కైంకర్యాలు, కనీసం దీపాలు కూడా పెట్టలేకపోతున్నట్లు సమాచారం. గత చంద్రబాబు ప్రభుత్వంలో నెలకు రూ.5వేల చొప్పున ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ. 10 వేలకు పెంచారని టీడీపీ ట్వీట్ చేసింది. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన ఈ హామీని ప్రభుత్వం ఏర్పడిన 50 రోజులలోనే నెరవేర్చారంటూ పేర్కొంది.