Home Page SliderTelangana

హైదరాబాద్‌కు కొత్త పోలీస్ కమీషనర్

Share with

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమీషన్ ఆదేశాల మేరకు కొందరు ఉన్నతాధికారులు, పోలీస్ కమీషనర్లు, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్స్‌ఫర్ అయిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్‌కు సందీప్ శాండిల్యను సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి, ఆయన స్థానంలో సందీప్ శాండిల్యను నియమించారు. సందీప్ గతంలో కూడా సైబరాబాద్ సీపీగా పని చేశారు. రాష్ట్రప్రభుత్వం ఒక పోస్టుకు ముగ్గురు చొప్పున వివరాలను రాష్ట్రప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి పంపారు. ఈ జాబితా నుండి ఒక్కొక్కరు చొప్పున ఎంపిక చేసి, వారి వివరాలను రాష్ట్రానికి ఇచ్చారు. ఈసీ పంపించిన జాబితాలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగులు, కమీషనర్లు, కలెక్టర్ల వివరాలు ఉన్నాయి. వీరందరూ నేటి(శుక్రవారం) సాయంత్రంలోగా బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ మినహా మిగిలిన వివరాలను నేటి మధ్యాహ్నమే విడుదల చేయాగా, హైదరాబాద్ సీపీని సాయంత్రం ప్రకటించారు.

వీరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టరుగా భారతీ హోలీకేరి, మేడ్చల్‌కు గౌతం, యాదాద్రికి హనుమంత్, నిర్మల్ అశీష్ సంగ్వాన్, ఎక్సైజ్ కమీషనర్‌గా జ్యోతి బుద్దప్రకాశ్, వాణిజ్యపన్నుల శాఖకు క్రిస్టినా, ఎక్సైజ్, వాణిజ్యపన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీప్రసాద్ ఐఏఎస్‌లుగా బాధ్యతలు తీసుకోబోతున్నారు.

తెలంగాణ ఐపీఎస్‌లుగా కొందరిని ప్రకటించారు. జగిత్యాల ఎస్పీగా సంప్రీత్ సింగ్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా చెన్నూరి రూపేష్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్థన్, కామారెడ్డి ఎస్పీగా సింధూ శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, జోగులాంబ గద్వాల్ ఎస్పీగా రితిరపాజ్, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ పంగ్రామ్ సింగ్ గణపతిరావ్‌, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ హెగ్డేలు నియమింపబడ్డారు.