Home Page SliderTelangana

తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు కొత్త ఆరోగ్యపథకం

Share with

తెలంగాణ ప్రభుత్వఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు తెలియజేస్తోంది. వారి సంక్షేమం కోసం కొత్త ఆరోగ్యపథకాన్ని తీసుకొస్తోంది. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధ్వర్యంలో ఇప్పటికే ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ( ఈహెచ్‌సీటీ) ఏర్పాటు చేశారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగులు, పింఛను దారులు తమ వాటాగా ట్రస్ట్‌కు ప్రతీనెలా కొంత మొత్తాన్ని జమ చేయవలసి ఉంటుంది. దీనిని వారి వేతనాలు, పెన్షన్ల నుండి బదిలీ చేస్తారు. వారు జమ చేసినంత మొత్తాన్ని ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్‌గా ప్రతీనెలా జమ చేస్తుంది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు తమ మూలవేతనంలో ఒకశాతం ఈ పథకంలో ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వగా మంత్రి హరీశ్ రావు ఆరోగ్య శ్రీ హెల్‌కేర్ ట్రస్ట్ సీఈవోతో కలిసి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఈ కొత్త పథకం అమలుకోసం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్ పర్సన్‌గా, ఆర్థిక శాఖ కార్యదర్శి, వైద్య ఆరోగ్య, విద్య, పరిపాలన శాఖల కార్యదర్శులతో కలిసి సభ్యులుగా వ్యవహరిస్తారు. ఉద్యోగుల తరపు నుండి కూడా ఆరుగురిని, పెన్షనర్ల తరపు నుండి ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. దీనిద్వారా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో కలిసి మొత్తం ఏడున్నర లక్షల మందికి లబ్ది చేకూరనుంది.