ఇందిరమ్మ ఇళ్ల కోసం సరికొత్త యాప్
ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటిచ్చింది. ఈ ఇళ్ల కోసం లబ్దిదారులను ఎంపిక చేసేందుకు కొత్త పద్దతిని అవలంభిస్తోంది. ‘బిల్డ్ నౌ’ అనే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ యాప్‌ను నేడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీనిద్వారా లబ్దిదారులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.