Home Page SliderTelangana

నల్గొండ జిల్లా

భువనగిరి, ఆలేరు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల నుండి గెలుపొందిన అభ్యర్థులు మొదటిసారి అసెంబ్లీలో కాలు పెడుతున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీ నుండే విజయం సాధించారు.

వలిగొండ మండల కేంద్రానికి చెందిన అనిల్‌కుమార్ రెడ్డి మొదటిసారి అసెంబ్లీలో కాలు పెడుతున్నారు.

తుంగతుర్తి నుండి పోటీ చేసిన మందుల సామేల్ తొలిసారి విజయం సాధించారు. చివరి నిమిషం టిక్కెట్ దక్కించుకున్న సామేల్ బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై 51,094 భారీ మెజార్టీతో విజయం సాధించి మొదటిసారి అసెంబ్లీలో కాలు పెడుతున్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్‌ను చివరి నిమిషంలో దక్కించుకున్న బత్తుల లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు.