Home Page SliderNational

అఖిల్‌కు హిట్టు పడ్డాకే ఫ్యాన్స్ ముందుకి: నాగార్జున

Share with

అక్కినేని కుటుంబంలో ఇప్ప‌టివ‌ర‌కు హిట్  సినిమా లేకుండా పోయింది, ఆ హీరో ఎవ‌రంటే వెంట‌నే గుర్తుకువచ్చే పేరు అఖిల్ – నాగార్జున కొడుకు. అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున‌ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా అఖిల్ (ది పవ‌ర్ ఆఫ్ జువ్వా) అంటూ ఫ‌స్ట్ సినిమాతోనే గ్రాండ్ లెవ‌ల్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అయితే ఈ సినిమా మాత్రం దారుణంగా అటకెక్కింది. ఇక ఆ త‌ర్వాత మిస్ట‌ర్ మ‌జ్ను, హ‌ల్లో, ఏజెంట్ అంటూ ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఈ సినిమాలు కూడా అఖిల్‌కు హిట్టును ఇవ్వలేకపోయాయి. ప్ర‌స్తుతం హిట్ కొట్టాలనే క‌సితో సాలిడ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు అఖిల్. నాగార్జున తాజాగా అఖిల్‌పై చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

దివంగ‌త న‌టులు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుక‌ను అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఎఎన్ఆర్ @100 పేరిట ఈ సినిమా వేడుక నేడు జ‌రుగ‌గా ఈ వేడుక‌కు ముఖ్య అతిథిగా నాగార్జున‌తో పాటు నాగ చైత‌న్య‌, అక్కినేని ఫ్యామిలీ హాజ‌రు కావడం విశేషం. ఈ వేడుక‌లో అక్కినేని నాగార్జున మాట్లాడుతుండ‌గా.. ఫ్యాన్స్ అంద‌రూ అఖిల్ ఎక్క‌డా కనబడడం లేదు అన్నారు, దాంతో అయ్యగారు ఎక్క‌డ అంటూ నాగార్జున‌ను అడ‌గ‌డం మొద‌లుపెట్టారు. అయితే అఖిల్ బ‌య‌ట క‌నిపించ‌క‌పోవ‌డంపై తాజాగా నాగార్జున వివరణ ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు అఖిల్ రాలేదు. ఎందుకంటే తనకంటూ ఓ హిట్టు సినిమా పడ్డాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు అంటూ నాగ్ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ అఖిల్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న‌ట్లు కామెంట్లు పెడుతున్నారు.