ఈనెల 29న విశాఖకు మోదీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29న విశాఖ పర్యటనకు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే పలు అభివృద్ది పనులకు శంకు స్థాపన చేయనున్నారు. విశాఖ రైల్వే జోన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించనున్నారు.వాటితో పాటు మరికొన్ని అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి విశాఖ ఓవర్ వ్యూ గ్యాలరీని వీక్షించనున్నారు.అనంతరం విశాఖ ఆంధ్రాయూనివర్సీటి గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని మాట్లాడతారని బీజెపి వర్గాలు ప్రకటించారు.

