రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ… రాష్ట్రపతి ముర్ము జీవితం, నాయకత్వం దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ‘గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆమెకు దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని.. భారత దేశానికి జ్ఞానం మరియు కృపతో స్ఫూర్తినిస్తూ ఉండాలని.. ప్రజలకు సేవ చేస్తూ ఆమెకు దేవుడు దీర్ఘకాలం మరియు ఆరోగ్యకరమైన జీవితం ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.