Home Page SliderNational

మిథున్ చక్రవర్తి భార్య హెలెనా ల్యూక్ కన్నుమూత

Share with

బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి మొదటి భార్య హెలెనా ల్యూక్ అమెరికాలో కన్నుమూశారు. ప్రముఖ నృత్యకారిణి, నటి కల్పనా అయ్యర్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబరు 3న హెలెనా ల్యూక్ తుదిశ్వాస విడిచినట్టు కల్పనా అయ్యర్ నిర్ధారించారు. అయితే, ఆమె మరణానికి గల కారణం తెలియరాలేదు. హెలెనా ల్యూక్ తో మిథున్ వివాహ బంధం కేవలం నాలుగు నెలల పాటే కొనసాగింది. 1979లో వీరి పెళ్లి జరగ్గా, అదే ఏడాది విడిపోయారు. ఆ తర్వాత హెలెనా ల్యూక్ అమెరికా వెళ్లిపోయి, అక్కడే విమానయాన రంగంలో స్థిరపడ్డారు. హెలెనాతో విడిపోయిన అనంతరం మిథున్.. 1979లోనే మరో నటి యోగితా బాలిని వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం కలగగా, మరొకరిని దత్తత తీసుకున్నారు. మిథున్ మొదటి భార్య హెలెనా ల్యూక్ అమితాబ్ బచ్చన్ హీరోగా ‘మర్ద్’ అనే హిందీ సినిమాలో నటించారు. ఆ మూవీలో ఆమె బ్రిటన్ రాణి పాత్ర పోషించారు.