రేపటిలోగా మంత్రులకు శాఖలు కేటాయిస్తా: సీఎం చంద్రబాబునాయుడు
మంత్రులతో సుమారు 20 నిమిషాల సేపు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రులతో జరిగిన భేటీలో కొన్ని కీలకాంశాలను ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తాను తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితులపై విశ్లేషించారు చంద్రబాబు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలన్నారు. ఓఎస్డీలు, పీఏలు, పీఎస్ ల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. శాఖల వారీగా శ్వేత పత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు పెడదామన్నారు. రేపటిలోగా శాఖలను కేటాయిస్తా. ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదేనన్నారు అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.