ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్ 29 జెట్ విమానం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా సమీపంలో ప్రమాదవశాత్తు నేలకూలింది.పంజాబ్ లోని ఆదంపూరు నుంచి ఆగ్రాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు చాకచక్యంగా విమానం నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. వీరితో పాటు విమానంలో ఉన్న మరో వ్యక్తి కూడా కిందకు దూకాడు.విమానం నేల కూలిన సమయంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.