Home Page SliderInternational

కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Share with

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా కువైట్‌లోని మంగాఫ్ ప్రాంతంలోని ఓ భవంతిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో ఏడుగురు భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ రోజు తెల్లవారు జామున 4.30 గంటలకు ఓ భవనంలోని కిచెన్‌లో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా పేర్కొంది. ఈ క్రమంలో మంటల నుండి బయట పడేందుకు కొంతమంది భవనంపై నుంచి దూకారు. అయితే అది చాలా ఎత్తైన భవనం కావడంతో దూకిన వారిలో కొందరు మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది అగ్నికి ఆహుతి అయ్యారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.