Home Page SliderNational

నాని సినిమాపై ట్వీట్ చేసిన మహేష్ బాబు

Share with

నేచురల్ స్టార్ నాని,మృణాల్ థాకూర్ జంటగా తెరకెక్కుతున్న సినిమా “హాయ్ నాన్నా”.ఈ సినిమా నుంచి గాజు బొమ్మ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. అయితే “ఇటు రావే నా గాజు బొమ్మ..నేనే నాన్నా..అమ్మా అంటూ” సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీనిపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించారు. “ఈ పాట ప్రతి నాన్న నుంచి కూతురికి చేరుతుంది. నా మాదిరిగానే ప్రతి తండ్రిలో ప్రతి ధ్వనిస్తుంది” అని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు హాయ్ నాన్న మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకి శౌర్య్ యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. హీషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం విడుదలైన గాజు బొమ్మ సాంగ్‌ మూవీపై అంచనాలను మరింతగా పెంచింది.