స్టైలిష్ లుక్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్
సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు స్టైలిష్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాగా ప్రముఖ సెలబ్రిటీ న్యూస్ మ్యాగజైన్ “HELLO” ఈ ఫోటోలను ప్రచురించింది. తమ అక్టోబర్ కవర్‌పేజ్‌లో సౌత్ సినిమా సూపర్ స్టార్ అంటూ HELLO మ్యాగజైన్ మహేష్ బాబు ఫోటోలను తాజాగా పబ్లిష్ చేసింది. దీంతో ఈ ఫోటోలను చూసిన మహేష్ ఫ్యాన్స్ కొత్త లుక్ సూపర్ అని ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కొందరు ఈ లుక్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” లోనివని షేర్ చేస్తున్నారు. దీంతో ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది.