Home Page SliderTelangana

కలిసి పనిచేద్దాం.. రేవంత్, సంజయ్‌కు షర్మిల ఫోన్

కేసీఆర్ సర్కారుపై కలిసి పోరాడదామంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు కాల్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై పోరాడదామని ఆమె కోరారు. కేసీఆర్ లాంటి ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే అందరూ కలిసికట్టుగా పోరాడాలని ఆమె చెప్పారు. లేకుంటే తెలంగాణలో విపక్షాలను కేసీఆర్ బతకనివ్వరన్నారు. షర్మిల విజ్ఞప్తిపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగుల విషయమై పోరాటానికి కలిసిపనిచేస్తామన్నారు. త్వరలో సమావేశమై… ఉమ్మడి పోరాటంపై చర్చిద్దామన్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ సైతం కేసీఆర్ సర్కారుపై అందరూ కలిసి పోరాడాలన్నారు. అయితే పార్టీలో దీనిపై చర్చించి.. నిర్ణయం ప్రకటిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.