మరికాసేపట్లో పొన్నాలతో భేటి కానున్న కేటీఆర్
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నిన్న ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొన్నాల బీఆర్ఎస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ ప్రచారం ఎట్టకేలకు నిజం కాబోతుంది. కాగా ఈ రోజు బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ పొన్నాలతో మరికాసేపట్లో భేటి కానున్నారు. ఈ మేరకు కేటీఆర్ ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు పొన్నాల నివాసానికి చేరుకోనున్నారు. కేటీఆర్ ఇవాళ పొన్నాలను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇందుకోసం కేటీఆర్ పలువురు బీఆర్ఎస్ నాయకులతో పొన్నాలతో భేటి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో గతకొన్ని ఏళ్లుగా పనిచేస్తూ సీనియర్ నేతగా కొనసాగుతున్న పొన్నాల పార్టీపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడిగా ,మంత్రిగా సేవలందించిన తాను పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పొన్నాల లక్ష్మయ్య నిన్న మీడియా ముందు కంటతడి పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.