త్వరలో కేటీఆర్ పాదయాత్ర?
టిజి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఫామ్ హౌస్‌లో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలతో ఆయన అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దాన్ని తమపై అభిమానంగా మార్చుకోవాలని కేసీఆర్ పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

