అంతరిక్షంలో భారీ ప్రాజెక్ట్.. ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్
అంతరిక్షంలో కిలోమీటర్ విస్తీర్ణంలో భారీ సౌర ప్రాజెక్ట్, ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్‌లను నిర్మించడానికి చైనా సిద్ధమవుతోంది. ‘త్రీగోర్జెస్ డ్యామ్’ అనే పేరుతో మానవ సృష్టిలో అతిపెద్ద వాటర్ రిజర్వాయర్‌గా ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ డ్యామ్‌ను అంతరిక్షం నుండి చూసినా కనిపించేంత భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికే ప్రపంచప్రజలంతా భయపడుతుంటే, మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అది స్పేస్‌లో ‘త్రీగోర్జెస్ డ్యామ్ ఆఫ్ స్పేస్’ అనే పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. సౌరశక్తిని భారీ స్థాయిలో ఒడిసిపట్టేందుకు భూమికి 32 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో కిలోమీటర్ వెడల్పుతో భారీ సౌరశ్రేణిని ఏర్పాటు చేస్తున్నామని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే మీడియా తెలియజేసింది. దీనివల్ల భూవాతావరణం, రాత్రి పగలుతో సంబంధం లేకుండా నిరంతరాయంగా సౌరశక్తిని సేకరించాలని ప్రణాళికలు వేస్తోంది చైనా. దీని ద్వారా ఒక ఏడాదిలో ఉత్పత్తయ్యే శక్తి భూమి నుండి తవ్వి తీసే మొత్తం చమురు నిల్వల నుంచి ఉత్పత్తయ్యే శక్తితో సమానం అని మీడియా కథనాలు వస్తున్నాయి.