‘కియారా నా అసలు పేరు కాదు’..రహస్యం బయటపెట్టిన కియారా అధ్వాణీ
తాజాగా తెలుగు ప్రేక్షకులను ‘గేమ్ ఛేంజర్’ మూవీతో అలరిస్తున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అధ్వాణీ తన పేరు గురించి రహస్యాన్ని చెప్పేసింది. తన అసలు పేరు అసలు కియారా కాదని, తన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆలియా అధ్వాణీ అని పేర్కొంది. తాను సినిమాకు వచ్చేటప్పటికే అలియా భట్ టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవడంతో సల్మాన్ ఖాన్ ఇచ్చిన సలహా మేరకు స్క్రీన్ నేమ్‌గా కియారా అధ్వాణీగా మార్చుకున్నానని పేర్కొంది. ప్రియాంక చోప్రా నటించిన ‘అంజానా అంజానీ’ అనే చిత్రంలో ప్రియాంక పేరు కియారా అని, ఆ పేరంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తనకు పాప పుడితే ఆ పేరే పెడదామనుకున్నా, కానీ నాకు స్క్రీన్ నేమ్ కావలసి రావడంతో నేనే ఆ పేరు పెట్టుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఎమ్‌ఎస్ ధోనీ బయోపిక్‌లో ధోని భార్య సాక్షి పాత్రలో తనను అభిమానులు బాగా గుర్తుపెట్టుకున్నారని, తాను డ్యాన్స్ చేసిన ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ అనే రీమేక్ పాటకు బాగా పేరు వచ్చిందని సంతోషం వ్యక్తం చేసింది.