రాజేందర్ చేసిన నేరమేంటి?
ఆయన తప్పేమీ లేదు… ఆయన చేసిన నేరం అసలేం లేదు.. కానీ ఆయనపై దొర పగబట్టాడు… పార్టీలో నెంబర్ 2గా ఎదుగుతున్నాడని… పార్టీలో పెద్దోడైపోతాడని దొరకు కంగారు పుట్టింది. ఇక ఎందుకు ఆలస్యం వేటేస్తే పోలా అనుకున్నాడు… ఈటల ఎక్కడ దొరుకుతాడని గుంటనక్కలా ఎదురు చూసి దొంగ దెబ్బతీశాడు. అయితే నిజం ఎప్పుడు నిప్పులాంది. ఈటల జీవితం గురించి ఇప్పుడు ఎవరో ప్రజలకు చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల్లో డబ్బు సంపాదించడం కోసం వచ్చినవాళ్లను చూశాం. రాజకీయాలకు డబ్బు ఖర్చు పెడుతున్న ఒక్క నాయకుడు ఈటల మాత్రమే. ఆర్థికంగా ఎలాంటి ఆసరా లేని గులాబీ పార్టీకి అన్నీ తానై అండగా నిలిస్తే… చివరకు కేసీఆర్ ఏంచేశాడో మనందరికీ తెలుసు.
అవసరం తీరిపోయాక కరివేపాకు చందంగా ఈటలను పక్కుకుబెట్టేశాడు కేసీఆర్… నిజం నిలకడ మీద తెలుస్తుంది. సమైక్య పాలకుల కత్తికి అడ్డం తిరిగి నిలబడ్డ ధీరుడు ఈటల. ప్రజల గొంతును అసెంబ్లీలో విన్పించి ప్రజల కోసమే బతికాడు. ప్రజలకు నచ్చిందే చేయడం ఈటల నైజం. కానీ రాజకీయ నాయకులకు నచ్చింది మాత్రం ఆయన ఎంత మాత్రం పట్టించుకోడు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా రాజేందర్ చూడలేదు. రాజేందర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ అస్తిత్వ పతాకం. ఎవరో ఏదో చేస్తే రాజేందర్ చెడ్డోడు కాడు.. ఎవరో మంచిగా చెప్పినంత మాత్రాన ఆయన పొంగిపోడు. రాజకీయనాయకుడికి కావాల్సిన సంపూర్ణ లక్షణాల మేలి మలుపు రాజేందర్… ఈటలపై చేసిన ఆరోపణలు చూసి ప్రజలు నవ్వుకున్నారు. చట్టం చుట్టంగా మార్చుకొని రాజకీయాలు చేస్తున్నపాలకులకు ప్రజలు ఇప్పటికే తగిన బుద్ధి చెప్పారు. వేల కోట్లు ప్రభుత్వం తరపునుంచి… పార్టీ నుంచి ఓటుకు నోటు… ఇలా ఎన్ని విన్యాసాలు వేసినా హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవ ప్రతీకను రెపరెపలాడించారు. ఇంకా ఏదో చేయాలని భావిస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు
ధరణిలో నమోదైన భూములనే కొనుగోలు చేశామని ఈటల సతీమణి జమున చాన్నాళ్ల కిందటే చెప్పారు. మరీ శత్రుత్వం ఉంటే ఇలా చేస్తారా… ఇది న్యాయమేనా కేసీఆర్… మీకు రైతులు వచ్చి ఫిర్యాదు చేసే అంత ఖాళీగా మీరు ఉన్నారా… మీ దగ్గరకు వచ్చి ఈటల మీద ఫిర్యాదు చేశారా… సినిమాల్లోనే ఇలాంటివి చూస్తుంటాం… కానీ రియల్ లైఫ్ లో మీరు ఈటలకు మరో సినిమా చూపించేదుకు ఇంతలా దిగజరాడమేంటి? 1994లో ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ అసైన్డ్ భూములు కబ్జా కావడం నిజంగా విడ్డూరమే మరి… శత్రువుకు కూడా హాని చేయాలని భావించని ఈటల రైతులను భయభ్రాంతులకు గురిచేసి వేధించడం ఏం న్యాయం సర్… సమైక్య పాలనలో లేని తప్పు… ప్రత్యేక రాష్ట్రంలోనా… కేసీఆర్… ప్రజలు అన్నీ గమనిస్తున్నారు… ప్రతిదానికి బదులు తీర్చుకుంటారు… ఒకరోజు అటూ ఇటూ అంతే…
పొరుగోడిని గౌరవించే తెలంగాణ సమాజానికి ఇదేనా మీరు చూపించాల్సిన తోవ. ఇదేనా తెలంగాణ సంస్కృతి.. సంప్రదాయం… నచ్చితే ఓకే… నచ్చకుంటే రాజకీయంగా అంతం చేస్తారా… ఇదేం న్యాయం సారూ… మీతోనే రాజకీయం చేశాడు… మీమ్మల్ని చూసే రాజకీయాల్లో ఓనమాలు దిద్దాడు. కానీ మీకు చేతగాని విధంగా ప్రజలతో మమేకమయ్యాడు. మీకంటే ప్రజలకు ఎక్కువ అందుబాటులో ఉండటమే ఆయన చేసిన నేరమా… ఇదేం పద్ధతి సారూ… అసైన్డ్ భూములను రైతులకు ఇచ్చేస్తున్నామంటూ ఇవాళ మరో కథ మొదలుపెట్టావు. రేపు ఇదే మాట మీద నిలబడతావా… చట్ట ప్రకారం చేసిన పనులకు… అధికారం అడ్డు పెట్టుకొని కొత్త ఎత్తులు వేస్తే అవి ఎంతో కాల సాగవు దొర… బడుగుల బిడ్డను ముట్టుకుంటే మసైపోతారన్న ఈటల మాటలు అక్షరసత్యాలవుతాయ్. బళ్లు ఓడలు… ఓడలు బళ్లు అవుతున్న కలియుగంలో ఉన్నాం మనం. దారికి రాకుంటే ప్రజలు చూస్తూ ఉరుకోరు దొర…