కేఏ పాల్ నిజ స్వరూపం బట్టబయలు
మత ప్రబోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై విరుచకుపడ్డారు బిషప్ భరత్ రత్నకుమార్. దేశంలో కేఎల్ పాల్ చరిత్ర ఎవరికీ తెలియదు…. కానీ తాను కూడా ఆ చరిత్ర బయటపెట్టాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. అయితే పాల్ వ్యవహరశైలి నచ్చకపోవడం వల్లే బయటపెట్టే అవకాశం లేకపోలేదన్నాడు. అందరూ చెప్పిన మాటను భరత్ మరోసారి చెప్పారు. కేఏ పాల్ ఓ జోకర్ అని… ఆయనను నమ్మి CBCNC ట్రస్ట్ అమెరికా పంపితే… ఆయనేం చేశారో చెబితే షాక్ అవుతారన్నారు బిషప్ రత్నకుమార్. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని… క్రైస్తవ వ్యవస్థను పాల్ నాశనం చేశాడన్నారు.
అసలు కేఏ పాల్ కు రాజకీయాలతో పనేంటని ప్రశ్నించారు. ఎక్కడ్నుంచి వచ్చారన్నది కేఏ పాల్ మరచిపోవద్దన్నారు. మోదీ, కేసీఆర్, జగన్, చంద్రబాబు, కేటిఆర్ గురించి ఎందుకంటూ దుయ్యబట్టారు. బాప్టిస్ట్‌గా అమెరికాకు వెళ్లి… క్రైస్తవ సంస్థలను దెబ్బతీశారన్నారు. కేఏ పాల్ ఐదు కార్లను… రెండున్నర కోట్ల ట్రస్ట్ డబ్బుల్లోంచి కొన్నాడన్నారు. పాల్ మారకుంటే ఈడీ కేసులు పెడతానంటూ హెచ్చరించాడు బిషప్ భరత్. మెడికల్ కాలేజీలో షేర్ ఉందని… సంస్థల్లో ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోందన్నాడు. 747 బోయింగ్ విమానం పాడైపోతే రెంట్ కడుతున్నామని… పాల్ ఒక మోసకారి… పాల్ డబ్బులివ్వకుండా కార్లు తీసుకెళ్లమన్నాడని… ఆయన చెబితేనే కార్లను తీసుకెళ్లానంటూ క్లారిటీ ఇచ్చారు బిషప్ భరత్.