జనసేన వారాహి యాత్ర పోస్టర్ రిలీజ్ -జోరుగా పవన్ ప్రచార యాత్ర
నేడు అమలాపురంలో జనసేన పార్టీ వారాహి యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. పవన్ ఎన్నికల ప్రచార యాత్ర జోరుగా సాగబోతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో అన్నవరం నుండి మొదలుకొని భీమవరం వరకూ పవన్ కళ్యాణ్ యాత్ర కొనసాగుతుందని తెలియజేశారు జనసేన నాయకులు. ఈ యాత్ర జూన్ 14 నుండి మొదలవుతుందని , ఈ నెల 21నఅమలాపురంలో జరుగనున్న జనసేన మహాసభను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. ఈ నియోజక వర్గంలోని ప్రతీ గ్రామంలో ఈ వారాహి యాత్రకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రతీ కూడలిలో ఈ చిత్రాలను, బ్యానర్లను ప్రదర్శిస్తున్నారు. ఈ పోస్టర్లను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. జిల్లాలవారీగా పవన్ కళ్యాణ్ ప్రచారం, కార్యక్రమాలు గురించి ఇప్పటికే కార్యకర్తలు రూట్ మ్యాప్‌లను తయారుచేశారు.

