Andhra PradeshHome Page Slider

కేంద్ర ప్రభుత్వ పథకాన్ని హైజాక్ చేసి సొంత పథకంలా జగన్ వాడుకుంటున్నారు

కేంద్ర ప్రభుత్వ పథకాన్ని హైజాక్ చేసి సొంత పథకంలా జగన్ వాడుకుంటున్నారని ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పుకుంటుందని ఈ మేరకు ఆయన సీఎం జగన్‌కు బహిరంగలేఖ రాసారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తున్నట్లు పేర్కొంటూ ఇంటింటికి వెళ్లే బియ్యం ఇచ్చే వాహనాలపై ప్రచారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దారిద్ర రేఖకు దిగువనున్న పేదలకు నెలకు 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం ఎక్కడ పేర్కొనడం లేదంటూ ఆక్షేపించారు. ప్రధాని గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు బియ్యం ఉచితంగా ఇస్తున్నట్లు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఉచిత బియ్యం పథకం అంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిన కూడా , రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. తప్పనిసరి స్థితిలో ముఖ్యమంత్రికి లేఖ రాయాల్సివచ్చినట్లు వీర్రాజు తెలిపారు.